నిర్మాతల కోసం వినోద పన్ను మినహాయింపు | Sakshi
Sakshi News home page

నిర్మాతల కోసం వినోద పన్ను మినహాయింపు

Published Sun, Mar 5 2017 3:10 AM

నిర్మాతల కోసం వినోద పన్ను మినహాయింపు - Sakshi

దీన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించాలంటూ హైకోర్టులో పిల్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వాలు ప్రేక్షకుల ప్రయోజనం కోసం కాకుండా సినిమాల నిర్మాతల కోసం వినోద పన్నును మినహాయింపునిస్తున్నాయని, దీన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ప్రభుత్వాల నుంచి పన్ను మినహాయింపు పొందిన నిర్మాతలు... దాని ప్రయోజనాన్ని ప్రేక్షకులకు వర్తింపచేయకుండా స్వలాభం పొందుతున్నారని సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం కార్యదర్శి ఎం.వేణుగోపాలరావు పేర్కొన్నారు.

అలాంటి నిర్మాతల నుంచి ఆ మొత్తాలను వసూలు చేసేలా ప్రభుత్వాలను ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు. ఇందులో ఏపీ, తెలంగాణ సీఎస్‌లు, తెలంగాణలో రుద్రమదేవి సినిమాకు వినోద పన్ను మినహాయింపు పొందిన గుణ టీమ్‌ వర్క్స్, ఏపీలో గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు వినోద పన్ను మినహాయింపు పొందిన రాజీవ్‌రెడ్డి తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు.

100 శాతం మినహాయింపు చట్ట విరుద్ధం...
మంచి సినిమాను ప్రోత్సహించడంలో భాగం గా ప్రభుత్వాలిచ్చే వినోద పన్ను మినహాయింపు మొత్తాన్నీ టికెట్‌ ధర నుంచి మినహా యించాలని పిటిషనర్‌  పిటిషన్‌లో తెలిపారు. రుద్రమదేవి సినిమాకి తెలంగాణ ప్రభుత్వం,  గౌతమీపుత్ర శాతకర్ణికి ఉభయ ప్రభుత్వాలూ 100% వినోద పన్ను మినహాయించాయ న్నారు. నిబంధనల ప్రకారం 50% కిమించి పన్ను మినహాయింపు ఇవ్వరాదన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement