యాత్రికులకు మెరుగైన సౌకర్యాలు

Enhanced facilities for pilgrims - Sakshi

హజ్‌ కమిటీ చైర్మన్‌ మసీవుల్లా ఖాన్‌

సాక్షి హైదరాబాద్‌: హజ్‌ –2018 యాత్రికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని రాష్ట్ర హజ్‌ కమిటీ చైర్మన్‌గా ఎన్నికైన మసీవుల్లా ఖాన్‌ అన్నారు. దేశంలోనే ఈ కమిటీని నంబర్‌వన్‌గా నిలుపుతామని ఆయన తెలిపారు. నాంపల్లి హజ్‌ కార్యాలయంలో గురువారం జరిగిన రాష్ట్ర హజ్‌ కమిటీ చైర్మన్‌ ఎన్నికల్లో ఆయన నూతన చైర్మన్‌గా ఎన్నికైనట్లు హజ్‌ కమిటీ ప్రత్యేక అధికారి ఎస్‌.ఎ.షుకూర్‌ ప్రకటించారు.

ఈ ఎన్నికతో కొత్త రాష్ట్ర హజ్‌ కమిటీ ఏర్పాటైందని, ఈ కమిటీ మూడేళ్ల పాటు కొనసాగుతుందని తెలిపారు. కొత్త చైర్మన్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయనని, ఈ పదవికి ఎన్నుకున్న సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు సీఈవో మన్నాన్‌ ఫారూఖీ ఎన్నికల అధికారిగా పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top