పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి | Effort the development of Dairy industry | Sakshi
Sakshi News home page

పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి

May 8 2016 1:29 AM | Updated on Sep 3 2017 11:37 PM

పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి

పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి

రాష్ట్రంలో పాడిపరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పశు సంవర్థక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు....

లాలాపేట: రాష్ట్రంలో పాడిపరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పశు సంవర్థక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం ఆయన లాలాపేటలోని విజయ డెయిరీని సందర్శించారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన స్టీమ్ బాయిలర్, గోడౌన్, సెంట్రల్ క్వాలిటీ ల్యాబ్‌ను ప్రారంభించారు.

అనంతరం మాట్లాడుతూ దేశవ్యాప్తంగా విజయ ఉత్పత్తులకు విశేష ఆదరణ ఉన్నందున మరిన్ని అవుట్‌లెట్స్ ఏర్పాటు చేస్తామన్నారు. పాడి రైతులను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నారన్నారు. రాష్ట్రంలో పశుగ్రాసం కొరత లేకుండా చూస్తామన్నారు. ఇకపై సబ్‌కమిటీ మీటింగ్ డెయిరీలోనే నిర్వహిస్తామన్నారు. డెయిరీ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎండీ నిర్మలను అభినందించారు

Advertisement
 
Advertisement
Advertisement