స్వచ్ఛ భారత్‌లో పాల్గొన్న మందుబాబులు | Drunkers have participated in Swachch bharat by court judgement | Sakshi
Sakshi News home page

స్వచ్ఛ భారత్‌లో పాల్గొన్న మందుబాబులు

Oct 8 2015 10:26 PM | Updated on May 25 2018 2:06 PM

మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడిన వారికి కోర్టు స్వచ్ఛ భారత్‌లో పాల్గొని వీధులు శుభ్రం చేయాలని కోర్టు శిక్షను విధించింది.

రాంగోపాల్‌పేట్: మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడిన వారికి స్వచ్ఛ భారత్‌లో పాల్గొని వీధులు శుభ్రం చేయాలని కోర్టు శిక్షను విధించింది. గురువారం సాయంత్రం మహంకాళి పోలీసులు మందు బాబులతో సికింద్రాబాద్ స్టేషన్ వద్ద వీధులను శుభ్రం చేయించారు. ఈ నెల 3వ తేదీన మహంకాళి పోలీసులు డ్రంకన్ డ్రైవ్ చేపట్టగా 9 మంది మద్యం సేవించి వాహనాలు నడిపినట్లు గుర్తించి వారిని ఈ నెల 7వ తేదీన 4వ మెట్రో పాలిటన్ కోర్టు ముందు హాజరుపరిచారు.

మెజిస్ట్రేట్ శ్రీదేవి ఇందులో 5 మందికి మూడు రోజులు రోజు గంట చొప్పున, నలుగురు రెండు రోజుల పాటు రోజు గంట చొప్పున స్వచ్ఛ భారత్‌లో పాల్గొనాలని ఆదేశించారు. గురువారం ఉత్తర మండలం ట్రాఫిక్ ఏసీపీ ముత్యంరెడ్డి, మహంకాళి ట్రాఫిక్ అదనపు ఇన్‌స్పెక్టర్ రామస్వామి, ఎస్సై కోటయ్య తదితరులు వారిచే రోడ్లు శుభ్రం చేయించారు. మందు తాగి వాహనాలు నడుపవద్దని ప్లకార్డులు పట్టుకుని ఆల్ఫా హోటల్ నుంచి మోండా మార్కెట్ రోడ్‌లో పాత గాంధీ చౌరస్తా వరకు వీధులను శుభ్రం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement