అంతరాష్ట్ర డ్రగ్‌ ముఠాపై పీడీ యాక్ట్‌ | Drug gang Interstate PD Act | Sakshi
Sakshi News home page

అంతరాష్ట్ర డ్రగ్‌ ముఠాపై పీడీ యాక్ట్‌

Sep 12 2016 9:07 PM | Updated on May 25 2018 2:29 PM

గోవా కేంద్రంగా దేశ వ్యాప్తంగా మాదకద్రవ్యాల దందా నిర్వహిస్తూ గత నెలలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుబడిన అంతరాష్ట్ర డ్రగ్‌ ముఠాపై నగర పోలీస్‌ కమిషనర్‌ పీడీ యాక్ట్‌ ప్రయోగించారు.

సాక్షి, సిటీబ్యూరో: గోవా కేంద్రంగా దేశ వ్యాప్తంగా మాదకద్రవ్యాల దందా నిర్వహిస్తూ గత నెలలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుబడిన అంతరాష్ట్ర డ్రగ్‌ ముఠాపై నగర పోలీస్‌ కమిషనర్‌ పీడీ యాక్ట్‌ ప్రయోగించారు. సీసీఎస్, టాస్క్‌ఫోర్స్‌ సంయుక్త ఆపరేషన్‌లో చిక్కిన నలుగురిపై ఈ చట్టం ప్రయోగించినట్లు టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ బి.లింబారెడ్డి సోమవారం తెలిసారు. నైజీరియాలోని వివిధ ప్రాంతాలకు చెందిన సొలోమెన్, ఒబేరా, చుకు, చుక్వాడీ సిటీలో చిక్కి ప్రస్తుతం రిమాండ్‌ ఖైదీలుగా ఉన్నారు. వీరిపై పీడీ యాక్ట్‌ ప్రయోగిస్తూ కొత్వాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement