మందుబాబుల చిందులు.. | drinkers nusense in banjara hills | Sakshi
Sakshi News home page

మందుబాబుల చిందులు..

Jun 26 2015 7:31 PM | Updated on Sep 2 2018 3:47 PM

బంజారాహిల్స్ రోడ్ నెం-10 లోని గౌరీశంకర్‌కాలనీ పరిసర ప్రాంతాలతో పాటు రామాలయానికి వెళ్లే రోడ్డులో తాగుబోతుల బెడద తీవ్రరూపం దాల్చింది.

బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం-10 లోని గౌరీశంకర్‌కాలనీ పరిసర ప్రాంతాలతో పాటు రామాలయానికి వెళ్లే రోడ్డులో తాగుబోతుల బెడద తీవ్రరూపం దాల్చింది. రాత్రి 9 గంటల నుండి అర్ధరాత్రి 2 వరకూ తాగుబోతులు రోడ్ల పక్కన తిష్ట వేసి మద్యం సేవిస్తూ న్యూసెన్స్‌కు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాత్రి విధులు ముగించుకొని ఇళ్లకు వెళ్లే మహిళలను అసభ్య పదజాలంతో వేధిస్తున్నారని దుయ్యబట్టారు.

జన్నత్‌ హుస్సేన్ ఇంట్లో ఓ ఆసుపత్రి హాస్టల్ ఉందని, ఇందులో నర్సులు ఉంటున్నారని అక్కడ కూడా మందుబాబులు తాగి వారి పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడే ఉన్న పార్కులో కూడా అర్ధరాత్రి వేళ మందుబాబులు చిందులు వేస్తూ స్థానికులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రిపూట పోలీసుల నిఘా లేకపోవడం వల్లే ఆకతాయిల బెడద తలెత్తిందని పోలీస్ పెట్రోలింగ్ ఉంచాలని కోరారు.

నిఘా పెంచుతాం
బంజారాహిల్స్ రోడ్ నెంబర్-10 లోని గౌరీశంకర్‌కాలనీ పరిసర ప్రాంతాలతో పాటు రామాలయానికి వెళ్లే రోడ్డులో రాత్రిపూట పోలీస్ పెట్రోలింగ్ పెంచుతామని స్థానిక సెక్టార్ ఎస్సై కృష్ణయ్య తెలిపారు. సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, తాగుబోతుల బెడద ఉంటే ఫోన్ నంబర్‌కు 9966074757 ఫిర్యాదు చేయవచ్చని ఆయన సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement