వస్తుసేవల పన్నుపై ఆందోళన వద్దు | Do not worry about GST taxes | Sakshi
Sakshi News home page

వస్తుసేవల పన్నుపై ఆందోళన వద్దు

Jul 8 2017 3:04 AM | Updated on Sep 5 2017 3:28 PM

వస్తుసేవల పన్ను (జీఎస్టీ)పై వ్యాపారులు, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జీఎస్టీ అదనపు కమిషనర్‌ ఆనంద్‌కుమార్‌ అన్నారు.

జీఎస్టీ అదనపు కమిషనర్‌ ఆనంద్‌కుమార్‌
 
సాక్షి, హైదరాబాద్‌: వస్తుసేవల పన్ను (జీఎస్టీ)పై వ్యాపారులు, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జీఎస్టీ అదనపు కమిషనర్‌ ఆనంద్‌కుమార్‌ అన్నారు. జీఎస్టీ చట్టాన్ని పకడ్బందీగా రూపొందించారని, జీఎస్టీ అమలుతో ప్రభుత్వాలు, ప్రజ లకు మేలు జరుగుతుందని చెప్పారు. జీఎస్టీ అమలు పరిశీలనకు కేంద్రం నియమించిన అధికారులతో కలసి శుక్రవారం హైదరాబాద్‌లో పర్యటించారు. బేగంబజార్‌లోని కిరాణా మర్చంట్స్, జనరల్‌ మర్చంట్స్, స్టీల్‌ మర్చంట్స్, కన్ఫెక్షనరీ అసో సియేషన్లు, వ్యాపారులతో చర్చించారు.

ఆనంద్‌కుమార్‌ మాట్లాడుతూ.. జీఎస్టీపై సందేహాలుంటే తమను అడిగి నివృత్తి చేసుకోవాలని వ్యాపారులకు సూచించారు. ఒక దేశం–ఒక పన్ను విధానంతో అమల్లోకి వచ్చిన జీఎస్టీ సమాజానికి మేలు చేస్తుందన్నారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్‌ శివనారాయణ్, అసిస్టెంట్‌ కమిషనర్‌ మనోజిత్‌ మజుం దార్, సెంట్రల్‌ ఎక్సైజ్‌ శాఖ సిబ్బంది ఎం.ఏ.రవూఫ్, టి.నాగమహేశ్, బి.వి.శ్రీధర్, జి.వి.ప్రసాద్, కొంపల్లి శ్రీనివాస్, బసన్నగౌడ, ఇన్‌స్పెక్టర్‌ హరిశర్మ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement