జూపల్లి... జూలో పిల్లి: డీకే అరుణ | dk aruna fires on jupalli | Sakshi
Sakshi News home page

జూపల్లి... జూలో పిల్లి: డీకే అరుణ

Apr 17 2016 12:46 AM | Updated on Aug 15 2018 9:30 PM

జూపల్లి... జూలో పిల్లి: డీకే అరుణ - Sakshi

జూపల్లి... జూలో పిల్లి: డీకే అరుణ

జూలో పిల్లి లాంటి మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడితే పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే డి.కె.అరుణ ....

హైదరాబాద్: జూలో పిల్లి లాంటి మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడితే పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే డి.కె.అరుణ వ్యాఖ్యానించారు. గాంధీభవన్‌లో శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ వ్యక్తిగత అవసరాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతకైనా దిగజారే జూపల్లికి తన ను విమర్శించే స్థాయి లేదన్నారు.


స్థాయి, వ్యక్తిత్వం లేని ఆయన మాట్లాడితే స్పందించాల్సిన అవసరం లేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడితే స్పందిస్తానని అరుణ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు, రీడిజైన్లు, అంచనాలు వంటి వాటిలో కోట్లాది రూపాయల అక్రమాలు జరిగాయని ఆమె ఆరోపించారు. అక్ర మాలు అడ్డుకోవడానికి కాపలా కుక్కల్లా పనిచేస్తామని ఆమె అన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement