వ్యక్తి మృతదేహం లభ్యం | dead body in canal | Sakshi
Sakshi News home page

వ్యక్తి మృతదేహం లభ్యం

Jul 12 2015 6:45 PM | Updated on Sep 3 2017 5:23 AM

తాగిన మత్తులో ప్రమాదవశాత్తు కాచిగూడ కబేళ వద్దనున్న హుస్సేన్‌సాగర్ నాలాలో పడిన వ్యక్తి మృతదేహాన్ని ఎట్టకేలకు పోలీసులు వెలికి తీసి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

హైదరాబాద్: తాగిన మత్తులో ప్రమాదవశాత్తు కాచిగూడ కబేళ వద్దనున్న హుస్సేన్‌సాగర్ నాలాలో పడిన వ్యక్తి మృతదేహాన్ని ఎట్టకేలకు పోలీసులు వెలికి తీసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాచిగూడ ఇన్‌స్పెక్టర్ డి.రాజ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... కృష్ణానగర్ ప్రాంతానికి చెందిన ఎం.శ్రీనివాస్ (46) శనివారం రాత్రి నాలాలో పడిపోయాడు.

శ్రీనివాస్ మృతదేహాన్ని వెలికితీయడానికి శనివారం రాత్రే ప్రయత్నించినా ఆచూకీ లభించలేదు. ఆదివారం కాచిగూడ కబేళ ట్రీట్‌మెంట్ ప్లాట్ నీటిని బంద్ చేయడంతో నాలాలో శ్రీనివాస్ మృతదేహం తేలింది. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీలో పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement