'కాంగ్రెస్ తప్ప అన్ని పార్టీలు స్వాగతించాయి' | dattatreya comments on modi pak visit | Sakshi
Sakshi News home page

'కాంగ్రెస్ తప్ప అన్ని పార్టీలు స్వాగతించాయి'

Dec 27 2015 1:24 PM | Updated on Mar 23 2019 7:58 PM

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాకిస్థాన్ పర్యటనను ఒక్క కాంగ్రెస్ పార్టీ తప్ప మిగిలిన పార్టీలన్నీ స్వాగతించాయని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు.

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాకిస్థాన్ పర్యటనను ఒక్క కాంగ్రెస్ పార్టీ తప్ప మిగిలిన పార్టీలన్నీ స్వాగతించాయని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. మోదీ పర్యటనను ఐక్యరాజ్యసమితి కూడా స్వాగతించిందని గుర్తు చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీకి మైనార్టీ ఓట్ల భయం పట్టుకోవడం వలనే ఈ పర్యటనను తప్పుపడుతున్నారని ఆయన విమర్శించారు.

పాక్ ప్రధానితో సహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయని దత్తాత్రేయ తెలిపారు. ఉగ్రవాద నిర్మూలనకు భారతీయ జనతా పార్టీకి స్పష్టమైన వైఖరి ఉందన్న ఆయన తెలంగాణలో ఉగ్రవాద నిర్మూలనకు కేంద్రం సహాయం చేస్తుందని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement