రాజ్భవన్ ముట్టడి యత్నం | CPI attempt to siege Raj Bhavan | Sakshi
Sakshi News home page

రాజ్భవన్ ముట్టడి యత్నం

May 14 2015 3:10 PM | Updated on Aug 14 2018 2:34 PM

రాజ్భవన్ ముట్టడి యత్నం - Sakshi

రాజ్భవన్ ముట్టడి యత్నం

తెలంగాణ సీపీఐ ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు రాజ్భవన్ ముట్టడించడానికి ప్రయత్నించారు.

హైదరాబాద్:  తెలంగాణ సీపీఐ ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు రాజ్భవన్ ముట్టడించడానికి ప్రయత్నించారు. భూసేకరణకు వ్యతిరేకంగా సీపీఐ ఈరోజు జైల్ భరో కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. రాజ్భవన్ ముట్టడికి ప్రయత్నించినవారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ బిల్లుకు అనుకూలమా? వ్యతిరేకమా? చెప్పాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్పోరేట్ల కోసమే భూ సేకరణ చేస్తోందని చాడా విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement