
ఆహ్వానిస్తే వెళతాం: కేటీఆర్
బంగారు తెలంగాణ కేసీఆర్తోనే సాధ్యమని పంచాయతీ రాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ నేత నర్సింహ యాదవ్ బుధవారం...
హైదరాబాద్ : బంగారు తెలంగాణ కేసీఆర్తోనే సాధ్యమని పంచాయతీ రాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ నేత నర్సింహ యాదవ్ బుధవారం కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో సీమాంధ్ర నేతలు దుష్ప్రచారం చేశారని, అయితే విభజన జరిగి ఏడాది అయినా ఒక్క సంఘటన కూడా జరగలేదని, హైదారాబాద్లో శాంతిభద్రతలకు ఢోకా లేదని అన్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానం వస్తే తప్పకుండా వెళ్లి ఆశీర్వదిస్తానని విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. కాగా రాజధాని శంకుస్థాపనకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసానికి వెళ్లి ఆయనను స్వయంగా ఆహ్వానిస్తామని చంద్రబాబు నాయుడు పేర్కొన్న విషయం తెలిసిందే.