బెదిరింపుల కేసులో సీఐడీ డీఎస్పీ అరెస్ట్ | cid dsp arrest in harassment case | Sakshi
Sakshi News home page

బెదిరింపుల కేసులో సీఐడీ డీఎస్పీ అరెస్ట్

May 15 2016 8:27 PM | Updated on Aug 20 2018 4:27 PM

తాను ఉంటున్న అపార్ట్‌మెంట్ మెయింట్‌నెన్స్ ఇవ్వమని అడిగినందుకు అపార్ట్‌మెంట్ వాసులను వేదించిన కేసులో ఏపీ సీఐడీ డీఎస్పీ వసంతకుమార్‌ను అరెస్ట్ చేసిన సంఘటన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది.

హైదరాబాద్‌సిటీః తాను ఉంటున్న అపార్ట్‌మెంట్ మెయింట్‌నెన్స్ ఇవ్వమని అడిగినందుకు అపార్ట్‌మెంట్ వాసులను వేదించిన కేసులో ఏపీ సీఐడీ డీఎస్పీ వసంతకుమార్‌ను అరెస్ట్ చేసిన సంఘటన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

చిక్కడపల్లి చందనబ్రదర్స్ ఎదురుగా ఉన్న పూర్ణఆదిత్య రెసిడెన్సీలో నివసించే ఏపి సిఐడి డిఎస్పీ వసంతకుమార్ గత కొంతకాలంగా అపార్ట్‌మెంట్ మెయింట్‌నెన్స్ డబ్బును చెల్లించడం లేదు. దీంతో అపార్ట్‌మెంట్ యాజమాన్యం మెయింట్‌నెన్స్ ఇవ్వాలని అడగడంతో వారిపట్ల దురుసుగా ప్రవర్తించారు. దీంతో వారు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో శనివారం రాత్రి ఫిర్యాదు చేశారు. దీంతో విచారించిన పోలీసులు వసంత్‌కుమార్‌ను ఆదివారం అరెస్ట్ చేశారు. ఇతనిపై 362, 462, 506 సెక్షన్‌ల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ సుదర్శన్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement