క్రిస్మస్ కార్నివాల్ | Christmas Carnival | Sakshi
Sakshi News home page

క్రిస్మస్ కార్నివాల్

Dec 8 2014 12:27 AM | Updated on Sep 2 2017 5:47 PM

క్రిస్మస్ కార్నివాల్

క్రిస్మస్ కార్నివాల్

కేక్ మిక్సింగ్‌లే కాదు... చిన్నారుల ప్రియ నేస్తం శాంతాక్లాజ్...

కేక్ మిక్సింగ్‌లే కాదు... చిన్నారుల ప్రియ నేస్తం శాంతాక్లాజ్... ఊరంతా షికారు తిప్పేందుకు గుర్రాలు... ఒంటెలు వచ్చేశాయి. నగరానికి అప్పుడే క్రిస్మస్ శోభను తెచ్చేశాయి. అబిడ్స్ స్టాన్లీ హైస్కూల్లో యంగిస్థాన్ ఫౌండేషన్ ఆదివారం నిర్వహించిన ‘కిస్మస్ కార్నివాల్’ వివిధ ఆశ్రమాలకు చెందిన 500 మంది అనాథ బాలల కేరింతలతో ఉత్సాహంగా సాగింది. రంగుల రాట్నం ఎక్కి గిర్రున తిరుగుతూ... ఎడారి ఓడలు, గుర్రాలపై స్వారీ చేస్తూ...

 శాంతాక్లాజ్‌తో కబుర్లు చెబుతూ పిల్లలు తమను తాము మరచిపోయారు. రాహుల్ కృష్ణన్ మాయాజాలం... జంపింగ్ హౌస్... బౌన్సింగ్ క్యాజిల్... సెలవు రోజున బుడతలు తెగ ఎంజాయ్ చేసేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement