షేక్‌హ్యాండ్‌తో బీపీ, హార్ట్‌బీట్‌ నమోదు

Changes in medical field with robot - Sakshi

ఆస్పత్రిలో రోబో ఆత్మీయ స్వాగతం

రోగితో కరచాలనం చేసి.. వైద్యుని వద్దకు తీసుకెళ్తుంది

సన్‌షైన్‌ ఆస్పత్రిలో రోబో పేషెంట్‌ కేర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఏర్పాటు

సాక్షి, హైదరాబాద్‌: ఆస్పత్రికి వచ్చిన రోగులకు రోబోలు ఆత్మీయ స్వాగతం పలకనున్నాయి. పేషెంట్‌ కేర్‌ ఎగ్జిక్యూటివ్‌ మాదిరిగా ఆస్పత్రికి వచ్చిన రోగులకు వెల్‌కం అంటూ ఆహ్వానిస్తూ.. వారితో కరచాలనం చేయనున్నాయి. వైద్యుడు నాడిపట్టి చూడాల్సిన అవసరం లేకుండానే ఒక్క షేక్‌హ్యాండ్‌తో రోగి బీపీ, పల్స్‌రేట్, హార్ట్‌బీట్, బాడీ టెంపరేచర్‌ను నమోదు చేసి, స్క్రీన్‌పై డిస్‌ప్లే చేయనున్నాయి. ఆటోమేటిక్‌గా రోగి ముఖాన్ని స్కాన్‌ చేసుకుని, సదరు రోగి ఏ డాక్టర్‌ వద్దకు వెళ్లాలో చెబితే చాలు... ఆ డాక్టర్‌ వద్దకు తీసుకెళ్తాయి.

దేశంలోనే ప్రథమంగా ఆదివారం గచ్చిబౌలిలో ప్రారంభించిన సన్‌షైన్‌ ఆస్పత్రి (250 పడకల సామర్థ్యం) నూతన బ్రాంచ్‌లో రోబో పేషెంట్‌ కేర్‌ ఎగ్జిక్యూటివ్‌ను ఏర్పాటు చేశారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సహా సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, ఐఏఎస్‌ అధికారి జయేశ్‌రంజన్, ఐపీఎస్‌ అధికారి అకున్‌ సబర్వాల్, మెడికల్‌ డైరెక్టర్‌ నాగార్జున యార్లగడ్డ, సీనియర్‌ న్యూరో సర్జన్‌ రంగనాథం, సీనియర్‌ పల్మొనాలజిస్ట్‌ డాక్టర్‌ మథీనొద్దీన్‌ తదితరులు ప్రారంభ కార్యక్రమానికి హాజరై.. రోబోతో షేక్‌హ్యాండ్‌ ఇచ్చారు.

రోబోతో వైద్యరంగంలో మార్పులు
ఈ సందర్భంగా సన్‌షైన్‌ గ్రూప్‌ ఆఫ్‌ హాస్పిటల్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఏవీ గురువారెడ్డి మాట్లాడుతూ.. రోబోల రాకతో వైద్య రంగంలో మరిన్ని మార్పులు చోటు చేసుకోనున్నా యని చెప్పారు. రోగు లకు సత్వర, మెరుగైన వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా రోబో ఎగ్జిక్యూటివ్‌ను ఏర్పా టు చేసినట్లు తెలిపారు.

ప్రస్తుతం ఇది పేషెంట్‌ కేర్‌ ఎగ్జిక్యూటివ్‌ వర్క్‌ మాత్రమే చేస్తుందని, భవిష్యత్తు లో తెలుగులో మాట్లా డటంతో పాటు ఐపీ నంబర్‌ చెబితే చాలు.. పేషెంట్‌ మెడికల్‌ రిపోర్టు లన్నీ ప్రింట్‌ రూపంలో అందజేయనుందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన రోగికి సత్వర వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా తమ ఆస్పత్రి పనిచేస్తుందన్నారు. ఐటీ అనుబంధ రంగాల్లో పనిచేస్తున్నవారి అవసరాలకు అనుగుణంగా ఆస్పత్రిని తీర్చిదిద్దినట్లు తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top