ఎయిర్‌పోర్టులో కారు కలకలం | car caused a sensation in Shamshabad Airport | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్టులో కారు కలకలం

Jul 6 2016 6:53 PM | Updated on Sep 4 2017 4:16 AM

శంషాబాద్ విమానాశ్రయంలో రెండు నెలలుగా ఉంచిన కారు అధికారులను పరుగులు పెట్టించింది.

శంషాబాద్ విమానాశ్రయంలో రెండు నెలలుగా ఉంచిన కారు అధికారులను ఉరుకులు పెట్టించింది. మంగళవారం రాత్రి ఆ కారుపై ఆరా తీసిన అధికారులు.. అది వనస్థలిపురం వాసిదిగా గుర్తించి ఊపిరి పీల్చుకున్నారు. విమానాశ్రయంలోని (బీ) పార్కింగ్ ఏరియాలో రెండు నెలలుగా ఉన్న కారును గుర్తించిన పార్కింగ్ నిర్వాహకులు ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించారు.

 

దీంతో ట్రాఫిక్ పోలీసులు కారును స్వాధీనం చేసుకుని ఆర్‌జీఐఏ పోలీసులకు అప్పగించారు. ఆ నానో కారు వనస్థలిపురానికి చెందిన మేఘేష్ కుమార్ శివశంకర్‌దిగా గుర్తించారు. బుధవారం ఉదయం బాంబుస్వ్కాడ్ బృందం కారును పూర్తిగా తనిఖీ చేసి అందులో ఏమీ లేదని తేల్చింది. కారును అన్ని రోజుల పాటు వదిలేసి వెళ్లడానికి గల కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement