సెట్‌టాప్‌ బాక్సులపై పిల్‌ కొట్టివేత | Cancellation of pill on the set boxes | Sakshi
Sakshi News home page

సెట్‌టాప్‌ బాక్సులపై పిల్‌ కొట్టివేత

Jun 2 2017 12:08 AM | Updated on Aug 31 2018 8:34 PM

సెట్‌టాప్‌ బాక్సులపై పిల్‌ కొట్టివేత - Sakshi

సెట్‌టాప్‌ బాక్సులపై పిల్‌ కొట్టివేత

ఉభయ రాష్ట్రాల్లోని అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లలోని వీక్ష కులు జనవరి 31 కల్లా సెట్‌టాప్‌ బాక్సులు ఏర్పాటు చేసుకోవాలన్న నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ

సాక్షి, హైదరాబాద్‌: ఉభయ రాష్ట్రాల్లోని అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లలోని వీక్ష కులు జనవరి 31 కల్లా సెట్‌టాప్‌ బాక్సులు ఏర్పా టు చేసుకోవాలన్న నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు గురువారం కొట్టే సింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ల ధర్మాసనం తీర్పు వెలువరించింది.

ఈ ఏడాది జనవరి 31కల్లా వీక్షకులు సెట్‌టాప్‌ బాక్సులను సమకూర్చుకోవాలంటూ కేంద్రం ఒత్తిడి చేస్తోందంటూ నగరానికి చెందిన సిటిజన్స్‌ వెల్ఫేర్‌ సొసైటీ హైకోర్టులో పిల్‌ దాఖలు చేసింది.  వాదనలు విన్న ధర్మాసనం గురువారం తన తీర్పును వెలువరించింది.  

Advertisement
 
Advertisement
Advertisement