బైకులను ధ్వంసం చేసిన అగంతకులు | bikes burnt by unknown persons in hyderabad | Sakshi
Sakshi News home page

బైకులను ధ్వంసం చేసిన అగంతకులు

Oct 15 2015 9:55 AM | Updated on Sep 4 2018 5:16 PM

రసూల్‌పురా ఇందిరానగర్‌లో గురువారం తెల్లవారు జామున గుర్తుతెలియని వ్యక్తులు బైకులు, సైకిళ్లను దహనం చేశారు.

హైదరాబాద్‌  : రసూల్‌పురా ఇందిరానగర్‌లో గురువారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు బైకులు, సైకిళ్లను దహనం చేశారు. స్థానికంగా నివాసం ఉంటున్న సిద్దులు కుటుంబానికి చెందిన మూడుబైకులు, ఒక సైకిల్‌ని రాత్రి ఇంటి ముందు పార్కు చేశారు.

తెల్లవారు జామున అగంతకులు ఆ బైకులు,  సైకిల్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో వాహానాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని చెప్పుతున్నారు. సిద్దులు కుటుంబానికి ఎవరి మీదనైనా అనుమానం ఉందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement