నగరంలోని శంషాబాద్‌లో గురువారం బైక్ రేసర్లు రెచ్చిపోయారు.
హైదరాబాద్: నగరంలోని శంషాబాద్‌లో గురువారం బైక్ రేసర్లు రెచ్చిపోయారు. బెంగుళూరు-హైదరాబాద్ జాతీయ రహదారిపై జరుగుతున్న రేస్‌ను ఆపేందుకు వెళ్లిన కానిస్టేబుల్ నరేందర్‌ను బైక్‌తో ఢీ కొట్టాడొ రేసర్. ఈ ఘటనలో కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలయ్యాయి.
దీంతో రంగంలోకి దిగిన ఎయిర్‌పోర్టు పోలీసులు 27 మంది రేసర్లను అదుపులోకి తీసుకున్నారు. 10 బైకులను సీజ్ చేశారు. గాయాలపాలైన కానిస్టేబుల్‌ను ఆసుపత్రికి తరలించారు. అరస్టైన రేసర్ల ఏడుగురు మైనర్లు కూడా ఉన్నారు. దీంతో వారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు పోలీసులు. రేసర్లంతా రాజేంద్రనగర్, వట్టేపల్లి, హసన్ నగర్, సులేమాన్ నగర్‌లకు చెందిన వారిగా పోలీసులు వెల్లడించారు.