నగరంలో నిషేధిత సిమీ ఉగ్రవాదుల అరెస్ట్ | Banned SIMI terrorists arrested in Hyderabad | Sakshi
Sakshi News home page

నగరంలో నిషేధిత సిమీ ఉగ్రవాదుల అరెస్ట్

Oct 22 2014 10:13 PM | Updated on Sep 4 2018 5:15 PM

నిషేధిత స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్ మెంట్ ఆఫ్ ఇండియా (సిమీ) సంస్థకు చెందిన ఉగ్రవాదులను నార్త్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు

హైదరాబాద్: నిషేధిత స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్ మెంట్ ఆఫ్ ఇండియా (సిమీ) సంస్థకు చెందిన ఉగ్రవాదులను నార్త్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రకు చెందిన సా ముదాసిర్, సోహెబ్ లుగా పోలీసులు గుర్తించారు. సా ముదాసిర్ గతంలో సిమీలో పనిచేశారు. ఇండియన్ ముజాహిద్దీన్ కు చెందిన మన్సూర్ ఆలీకి సోహెబ్ సహచరుడని పోలీసులు వెల్లడించారు. 
 
సోషల్ మీడియా ద్వారా జిహద్ ప్రచారం నిర్వహిస్తున్న సాముదాసిద్, సోహెబ్ లను అరెస్ట్ చేసినట్టు పోలీసులు మీడియాకు వెల్లడించారు. ఫేస్ బుక్ ద్వారా పాకిస్థాన్ కు చెందిన అబూ సైఫ్, కమ్రాన్ షాలతో చాటింగ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. భారత దేశంలో బాంబులతో విధ్వంసం సృష్టించాలని సాముదాసిర్, సోహెబల్ లను ఫేస్ బుక్ చాటింగ్ లో అబూసైఫ్, కమ్రాన్ షాలు కోరినట్టు పోలీసులు వెల్లడించారు. 

Advertisement
 
Advertisement
Advertisement