పొంగిపోను.. కుంగిపోను..: దత్తాత్రేయ | Bandaru Dattatreya comments in ESIC office | Sakshi
Sakshi News home page

పొంగిపోను.. కుంగిపోను..: దత్తాత్రేయ

Mar 7 2017 2:31 AM | Updated on Sep 5 2017 5:21 AM

పొంగిపోను.. కుంగిపోను..: దత్తాత్రేయ

పొంగిపోను.. కుంగిపోను..: దత్తాత్రేయ

‘‘నేను సన్మానాన్ని, అవమానాన్ని ఒకే విధంగా స్వీకరిస్తా. సన్మానించారని పొంగిపోను..

సాక్షి, హైదరాబాద్‌: ‘‘నేను సన్మానాన్ని, అవమానాన్ని ఒకే విధంగా స్వీకరిస్తా. సన్మానించారని పొంగిపోను.. అవమానించారని కుంగిపోను. స్థిరంగా ఉంటా’’ అని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. రాజ్‌భవన్‌ సిబ్బంది గృహ సముదాయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన గైర్హాజరైన విషయం తెలిసిందే. దీనిపై విలేకర్లు ప్రశ్నించగా పైవిధంగా బదులిచ్చారు. ఆహ్వానం అందిందా.. లేదా.. అనే అంశంపై తాను స్పందించనన్నారు.

సోమవారం ఈఎస్‌ఐసీ కార్యాలయంలో బండారు దత్తాత్రేయ మీడియాతో మాట్లాడారు. పార్ల మెంటులో మహిళా బిల్లు ఆమోదం పొందితే మహిళలకు మరింత లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. దీనికి అన్ని పార్టీలూ మద్దతివ్వాలని కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం నగరంలో మహిళా కార్మికు లు, సంబంధిత అంశాలపై రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించనున్నట్లు ఈ సంద ర్భంగా మంత్రి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement