చెత్తకుప్పలో పసికందు | baby found in garbage | Sakshi
Sakshi News home page

చెత్తకుప్పలో పసికందు

May 21 2016 12:17 PM | Updated on Sep 4 2017 12:37 AM

అప్పుడే పుట్టిన శిశువును చెత్తకుప్ప పాలు చేశారు. కాప్రా మున్సిపాలిటీ పరిధిలో ఈఘటన చోటుచేసుకుంది.

హైదరాబాద్: అప్పుడే పుట్టిన శిశువును చెత్తకుప్ప పాలు చేశారు. కాప్రా మున్సిపాలిటీ పరిధిలో ఈఘటన చోటుచేసుకుంది. హెచ్‌బీ కాలనీలో గల చెత్తకుప్పలో శనివారం ఉదయం స్థానికులకు పసికందు ఏడుపు వినిపించింది. వెళ్లి చూడగా చిత్తుకాగితాల మధ్య చుట్టి ఉన్న మగశిశువు ఏడుస్తోంది. దీంతో వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. వారు శిశువును వెంటనే 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement