Sakshi News home page

రాష్ట్రాభివృద్ధికి ఎయిర్పోర్టు అవసరం లేదా ?

Published Tue, Oct 6 2015 6:13 PM

Ayyanna patrudu takes on opposition party leader

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో ఎయిర్పోర్టులు వద్దని కొందరు నేతలు రెచ్చగొడుతున్నారని ఆ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీహెచ్ అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్లో విలేకర్లతో అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ... రాష్ట్రాభివృద్ధిపై అవగాహన లేమి ఉన్నవారే ఎయిర్పోర్టును అడ్డుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రాభివృద్ధికి ఎయిర్పోర్టు అవసరం లేదా ? అని రాజకీయ నేతలను అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు.

విజయనగరం జిల్లా భోగాపురంలో ఎయిర్ పోర్ట్ కోసం చంద్రబాబు ప్రభుత్వం భూములు సేకరిస్తుంది. అయితే తమ భూములు ఇచ్చేది లేదని ఆ ప్రాంత రైతులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం భోగాపురం మండల ప్రాంతంలో పర్యటించారు.

ఈ సందర్భంగా వైఎస్ జగన్ అండగా ఉంటానని సదరు రైతులకు భరోసా ఇచ్చారు. పేదలు, రైతుల భూముల చంద్రబాబు ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. అవసరమైతే కోర్టుకు వెళ్తామని చంద్రబాబు ప్రభుత్వానికి వైఎస్ జగన్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అయ్యన్నపాత్రుడుపై విధంగా స్పందించారు. 

Advertisement
Advertisement