కేబుల్‌ టీవీ ప్రసారాల్లో సర్కారు జోక్యాన్ని నిరోధించండి | Avoid government intervention in cable TV broadcasts | Sakshi
Sakshi News home page

కేబుల్‌ టీవీ ప్రసారాల్లో సర్కారు జోక్యాన్ని నిరోధించండి

Sep 17 2017 1:34 AM | Updated on Sep 2 2018 5:24 PM

కేబుల్‌ టీవీ ప్రసారాల్లో సర్కారు జోక్యాన్ని నిరోధించండి - Sakshi

కేబుల్‌ టీవీ ప్రసారాల్లో సర్కారు జోక్యాన్ని నిరోధించండి

కేబుల్‌ టీవీ ప్రసారాల రంగంలోకి అడుగుపెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరోధించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలైంది.

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే హైకోర్టులో పిటిషన్‌
 
సాక్షి, హైదరాబాద్‌: కేబుల్‌ టీవీ ప్రసారాల రంగంలోకి అడుగుపెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరోధించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలైంది. రాష్ట్ర ప్రభుత్వం కేబుల్‌ టీవీ ప్రసారాల రంగంలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకునేలా టెలికాం అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌)తో పాటు ఆర్థిక, పెట్టుబడుల శాఖలను ఆదేశించాలని కోరుతూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ వ్యాజ్యాన్ని వేశారు.
 
సర్కారు జోక్యం రాజ్యాంగ విరుద్ధం
రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా కేబుల్‌ టీవీ ప్రసారాల రంగంలోకి దిగరాదని సర్కారియా కమిషన్‌ 2008లో కేంద్ర ప్రసారశాఖకు సిఫారసులు పంపిందని రామకృష్ణా రెడ్డి తెలిపారు. బ్రాడ్‌కాస్టింగ్‌ మీడియా ప్రభుత్వ నియంత్రణలో ఉండకూడదంటూ క్రికెట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ బెంగాల్‌ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా సర్కారియా కమిషన్‌ ఈ సిఫారసులు చేసిందన్నారు. ఈ వ్యాజ్యంపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ జరిపే అవకాశం ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement