నగరంలో మరో చైన్ స్నాచింగ్ | Another city Chain snacing | Sakshi
Sakshi News home page

నగరంలో మరో చైన్ స్నాచింగ్

May 20 2016 4:54 AM | Updated on Sep 5 2018 2:12 PM

నగరంలో మరో చైన్ స్నాచింగ్ - Sakshi

నగరంలో మరో చైన్ స్నాచింగ్

రాష్ట్ర రాజధాని నగరంలో మరో గొలుసు దొంగతనం జరిగింది. పద్మారావునగర్‌లో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది.

* పద్మారావునగర్‌లో వృద్ధురాలి మెడలో గొలుసు చోరీ   
* నిఘానేత్రానికి చిక్కిన నిందితుడు

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని నగరంలో మరో గొలుసు దొంగతనం జరిగింది. పద్మారావునగర్‌లో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే స్నాచింగ్ దృశ్యాలు నిఘానేత్రానికి చిక్కాయి. పోలీసులు తెలిపిన వివరాలు.. పద్మారావునగర్‌కు చెందిన రామనాథరావు, రమాదేవి(70) భార్యాభర్తలు. బుధవారం మధ్యాహ్నం గాంధీ ఆస్పత్రి వెనుక గల డయాగ్నోస్టిక్ సెంటర్‌లో వైద్య పరీక్షలు చేయించుకుని నడుచుకుంటూ వెళుతుండగా.. వెనుక నుంచి వచ్చిన చైన్ స్నాచర్ రమాదేవి మెడలోని గొలుసు తెంపబోయాడు.

ఆమె గట్టిగా పట్టుకోవడంతో చిన్న బంగారు గొలుసు ముక్క స్నాచర్ చేతిలో ఉండిపోయింది. రామనాథరావు వాకింగ్ స్టిక్‌తో నిందితుడిని నిలువరించబోయేలోగా అతను పరిగెత్తుకుంటూ వెళ్లి నిలిపి ఉంచిన వాహనంపై పరారయ్యాడు. ఈ క్రమంలో రామనాథరావు కిందపడిపోవడంతో గాయాలయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement