
మరో 4 రోజులు మోస్తరు వర్షాలు
రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజులు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం మంగళవారం తెలిపింది.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజులు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం మంగళవారం తెలిపింది. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గత 24 గంటల్లో తాండూరులో అత్యధికంగా 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి, భువనగిరి, హుజూరాబాద్‌లలో 5 సెంటీమీటర్లు, కల్వకుర్తి, జనగాంలలో 4 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.