
హైదరాబాద్ : నగరంలో ఈ నెల 31వ తేదీన సైబరాబాద్, హైద్రాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు అన్ని ఫ్లై ఓవర్లు మూసివేస్తామని సైబరాబాద్ సీపీ సందీప్ శాండిల్య తెలిపారు.
31న నైట్ సెలెబ్రేషన్స్ రాత్రి ఒంటి గంట వరకే పర్మిషన్ ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో చాలా సీరియస్‌గా వ్యవహరిస్తామని, మొత్తం 120 టీమ్‌లు బ్రీత్ అనలైజర్లతో సిద్ధంగా ఉంటారన్నారు. అలాగే స్పీడ్ లిమిట్ తప్పనిసరి అని, అతి వేగంతో వాహనాలు నడిపితే వాహనాలను సీజ్ చేస్తామని వెల్లడించారు.