ఎయిమ్స్ టాపర్గా హైదరాబాదీ | aiims topper hyderabad student | Sakshi
Sakshi News home page

ఎయిమ్స్ టాపర్గా హైదరాబాదీ

Jun 15 2016 2:39 AM | Updated on Sep 5 2018 8:36 PM

ఎయిమ్స్ టాపర్గా హైదరాబాదీ - Sakshi

ఎయిమ్స్ టాపర్గా హైదరాబాదీ

ఆల్‌ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(ఎయిమ్స్) ప్రవేశ పరీక్ష ఫలితాల్లో నగర విద్యార్థి సత్తా చాటాడు.

సాక్షి, హైదరాబాద్: ఆల్‌ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(ఎయిమ్స్) ప్రవేశ పరీక్ష ఫలితాల్లో నగర విద్యార్థి సత్తా చాటాడు. ఇ.సాత్విక్‌రెడ్డి ఆల్‌ఇండియా మొదటి ర్యాంకు సాధించాడు. ఏపీ ఎంసెట్‌లో 2వ ర్యాంకు సాధించిన సాత్విక్... తల్లి శశికళ సాప్ట్‌వేర్ ఇంజనీర్. తండ్రి నరేంద్రరెడ్డి హైకోర్టులో న్యాయవాది. ‘చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనుకునే వాడిని. అమ్మనాన్నల ప్రోత్సాహం, కళాశాల అధ్యాపకులు చక్కటి గెడైన్స్ ఇచ్చారు. దీని ఫలితంగానే ఏపీ ఎంసెట్‌లో 2, తెలంగాణ ఎంసెట్‌లో 15వ ర్యాంకు సాధించగలిగాను. ఎయిమ్స్‌లో మంచి ర్యాంకు వస్తుందని భావించా. కానీ టాపర్‌ను అవుతాననుకోలేదు. న్యూరాలజిస్ట్ అవుతా’ అని సాత్విక్‌రెడ్డి చెప్పాడు.

Advertisement
 
Advertisement
Advertisement