డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ సినీ నటుడు | actor sai rohit caught in drunk and drive at jubilee hills | Sakshi
Sakshi News home page

డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ సినీ నటుడు

Jun 5 2016 6:55 AM | Updated on Apr 3 2019 9:02 PM

డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ సినీ నటుడు - Sakshi

డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ సినీ నటుడు

నగరంలోని జూబ్లీహిల్స్‌తో పాటు పలు ప్రధాన కూడలిల్లో శనివారం అర్థరాత్రి పోలీసులు భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్‌ నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో మరో సినీ నటుడు అడ్డంగా బుక్కయ్యాడు.

హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్‌తో పాటు పలు ప్రధాన కూడలిల్లో శనివారం అర్థరాత్రి పోలీసులు భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్‌ నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో మరో సినీ నటుడు అడ్డంగా బుక్కయ్యాడు. కాయ్ రాజా కాయ్ ఫేం సాయి రోహిత్ మద్యం సేవించి కారు నడుపుతూ పోలీసులుకు దొరికిపోయాడు.

జూబ్లీహిల్స్‌లో ట్రాఫిక్ పోలీసులు అతన్ని బ్రీత్ ఎనలైజర్ లో చెక్ చేయగా తాగి వాహనాన్ని నడిపినట్లు తేలింది. బ్రీత్ ఎనలైజర్‌లో 42 శాతం నమోదైనట్లు పోలీసులు తెలిపారు. అతనికి కౌన్సిలింగ్ నిర్వహించి కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement