ఆరోగ్య పరిరక్షణలో అసాధారణమైన సేవలందిస్తున్నందుకు ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్టుకు ఫిక్కీ హెల్త్‌కేర్ ఎక్స్‌లెన్స్ అవార్డు లభించింది.
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్య పరిరక్షణలో అసాధారణమైన సేవలందిస్తున్నందుకు ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్టుకు ఫిక్కీ హెల్త్‌కేర్ ఎక్స్‌లెన్స్ అవార్డు లభించింది. ఈనెల 1న న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఫిక్కీ అవార్డుల జ్యూరీ చైర్మన్, కాశ్మీర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్ సరీన్, అపోలో ఆస్పత్రుల అధినేత డాక్టర్ ప్రతాప్‌రెడ్డి చేతుల మీదుగా ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈఓ ధనుంజయ్‌రెడ్డి అవార్డును అందుకున్నారు. పేదలకు నాణ్యమైన వైద్యసేవలను అందించినందుకుగాను ఈ అవార్డును ప్రదానం చేశారు. అవార్డు కోసం దేశవ్యాప్తంగా అందిన దరఖాస్తుల పరిశీలనకు జస్టిస్ మన్మోహన్‌సరీన్ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ దరఖాస్తుల పరిశీలనతోపాటు క్షేత్రస్థాయిలోనూ అధ్యయనం చేసిన అనంతరం ‘ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్టు’ను ఎంపిక చేసింది.