పరీక్ష ఫీజు చెల్లించలేక విద్యార్థిని ఆత్మహత్య | A student committed to pay examination fees | Sakshi
Sakshi News home page

పరీక్ష ఫీజు చెల్లించలేక విద్యార్థిని ఆత్మహత్య

Apr 8 2016 1:04 AM | Updated on Nov 9 2018 5:02 PM

పరీక్ష ఫీజు చెల్లించే స్తోమత తల్లిదండ్రులకు లేకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన ఓ విద్యార్థిని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది.

హైదరాబాద్: పరీక్ష ఫీజు చెల్లించే స్తోమత తల్లిదండ్రులకు లేకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన ఓ విద్యార్థిని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ దుర్ఘటన హైదరాబాద్ కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. అంబర్‌పేట మారుతీనగర్‌కు చెందిన శ్రీరాములు మాదిగ కూతురు కొల్లూరి వాత్సల్య(20) బేగంపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతోంది. మొదటి సెమిస్టర్ పరీక్షలో వాత్సల్య ఫెయిలైంది. దీంతో పరీక్ష ఫీజు చెల్లించే స్తోమత తల్లిదండ్రులకు లేదని ఆమె సుసైడ్ నోట్‌లో రాసి జామై ఉస్మానియా-ఆర్ట్స్ కాలేజ్ రైల్వే స్టేషన్ల మధ్య గురువారం ఉదయం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. కాచిగూడ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకునిదర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement