పోలీస్ స్టేషన్‌లో ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు | A person seriously injuried in Police station | Sakshi
Sakshi News home page

పోలీస్ స్టేషన్‌లో ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

Mar 13 2016 1:59 PM | Updated on Apr 3 2019 7:53 PM

ఎల్‌బీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ప్రమాదం చోటు చేసుకుంది.

ఎల్‌బీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇక్కడ పోలీస్ స్టేషన్ భవన విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఓ కేసు విషయమై ఆదివారం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన యువకుడి తలపై ఇటుకలు పడడంతో అతడు తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement