డ్రగ్స్ పై నిఘా పెట్టిన పోలీసులు నగరంలో విస్తృత తనిఖీలు చేపడుతున్నారు.
నైజీరియన్ల ఇళ్లలో ఆకస్మిక తనిఖీలు
Aug 10 2017 4:27 PM | Updated on Oct 17 2018 5:28 PM
హైదరాబాద్ : డ్రగ్స్ పై నిఘా పెట్టిన పోలీసులు నగరంలో విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాచకొండ కమిషనరేట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న నైజీరియన్స్ ఇళ్లలో గురువారం పోలీసుల సోదాలు నిర్వహించారు. ఎల్‌బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్ పరిధిలో వీసాలేని పలువురు నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నారు. వారిని రాచకొండ పోలీసులు, ఇమ్మిగ్రేషన్ అధికారులు విచారిస్తున్నారు. వీసా గడువులు ముగుసినప్పటికీ హైదరాబాద్లో నివాసం ఉంటున్న ఆరుగురిని అరెస్ట్ చేశారు.
Advertisement
Advertisement