సెక్స్ రాకెట్ గుట్టురట్టు.. ఐదుగురి అరెస్ట్ | 5 arrested for prostitution in SOT police ride | Sakshi
Sakshi News home page

సెక్స్ రాకెట్ గుట్టురట్టు.. ఐదుగురి అరెస్ట్

Feb 20 2016 5:08 PM | Updated on Mar 28 2018 11:26 AM

సెక్స్ రాకెట్ గుట్టురట్టు.. ఐదుగురి అరెస్ట్ - Sakshi

సెక్స్ రాకెట్ గుట్టురట్టు.. ఐదుగురి అరెస్ట్

వ్యభిచార గృహంపై ఎస్‌వోటీ (స్పెషల్ ఆపరేషన్స్ టీమ్) పోలీసులు దాడి చేసి ఐదుగురిని అరెస్టు చేశారు.

మేడిపల్లి: వ్యభిచార గృహంపై ఎస్‌వోటీ (స్పెషల్ ఆపరేషన్స్ టీమ్) పోలీసులు దాడి చేసి ఐదుగురిని అరెస్టు చేశారు. వ్యభిచార ముఠా గుట్టు రట్టయిన ఈ ఘటన బోడుప్పల్‌లోని సాయి భవానీ నగర్‌లో చోటుచేసుకుంది. చిలకలగూడకు చెందిన విజయకుమార్ భార్య వల్లపు దాస్‌నేరి(34), నారాయణగూడకు చెందిన రాపోలు రాధిక(32)లు స్థానికంగా ఒక ఇంటిని అద్దెకు తీసుకుని గత కొన్ని నెలలుగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.

ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు శనివారం దాడిచేసి నిర్వాహకులతోపాటు మరో ముగ్గురు విటులను అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచారం చేస్తున్న ఇద్దరు మహిళలను రెస్క్యూ హోమ్ కు తరలించనున్నట్టు ఎస్‌వోటీ ఎస్సై ఆంజనేయులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement