పీవీ ఎక్స్ప్రెస్ వే పై నాలుగు కార్లు ఢీ | 4 cars collission in pv express way | Sakshi
Sakshi News home page

పీవీ ఎక్స్ప్రెస్ వే పై నాలుగు కార్లు ఢీ

Dec 7 2015 5:42 PM | Updated on Apr 3 2019 7:53 PM

రాజేంద్రనగర్ లోని పీవీ ఎక్స్ప్రెస్ వే పై సోమవారం నాలుగు కార్లు ఢీ కొన్నాయి.

హైదరాబాద్: రాజేంద్రనగర్ లోని పీవీ ఎక్స్ప్రెస్ వే పై వేగంగా వెళ్తున్న నాలుగు కార్లు సోమవారం ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలవ్వగా, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గురైన కార్లు ఎక్స్ ప్రెస్ వేపై నిలిచి ఉండటంతో కిలో మీటర్ మేర ట్రాఫిక్ జాం అయింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గురైన కార్లను అక్కడ నుంచి తొలగించి ట్రాఫిక్ నియంత్రించే పనిలో నిమగ్నమయ్యారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement