మహిళకు లైంగిక వేధింపులు.. నలుగురి అరెస్ట్ | 4 arrested in molestation case in hyderabad | Sakshi
Sakshi News home page

మహిళకు లైంగిక వేధింపులు.. నలుగురి అరెస్ట్

Dec 20 2015 9:39 PM | Updated on Jul 23 2018 8:49 PM

ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి ప్రవేశించిన నలుగురు ఆకతాయిలు ఆమెను లైంగికంగా వేధించారు.

కుత్బుల్లాపూర్: ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి ప్రవేశించిన నలుగురు ఆకతాయిలు ఆమెను లైంగికంగా వేధించారు. దీంతో తనపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో పాటు దౌర్జన్యం చేశారని ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు నలుగురు యువకులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ సంఘటన నగరంలోని కుత్బుల్లాపూర్ భాగ్యలక్ష్మీ కాలనీలో ఆదివారం చోటుచేసుకుంది.

వివరాలిలా ఉన్నాయి... భాగ్యలక్ష్మీ కాలనీలో నివాసముంటున్న ఓ మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అదే ఇంట్లో పైఅంతస్తులో అద్దెకు ఉండే నలుగురు యువకులు ఈ నెల 18న ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. తలుపులు తెరచుకుని లోపలికి వెళ్లి ఆమెను లైంగికంగా వేధించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆదివారం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement