ఫైల్ ఫోటో
నగరంలోని మీర్‌పేటలో విషాదం నెలకొంది. మనీష్ అనే రెండేళ్ల బాలుడు స్కూలు బస్సు కింద పడి మృతిచెందాడు.
హైదరాబాద్: నగరంలోని మీర్‌పేటలో విషాదం నెలకొంది. మనీష్ అనే రెండేళ్ల బాలుడు స్కూలు బస్సు కింద పడి మృతిచెందాడు. మీర్‌పేట శివ హిల్స్‌లో రమేష్ అనే ప్రైవేట్ స్కూల్ టీచర్ నివాసముంటున్నారు. ఎప్పటి మాదిరి మంగళవారం ఉదయం 8.30 గంటల సమయంలో కుమార్తెను భారతి విద్యాలయ స్కూల్ బస్సు ఎక్కిస్తున్నారు.
అక్కకు టాటా చెప్పేందుకు బస్సు వద్దకు వచ్చిన మనీష్ ప్రమాదవశాత్తు అదే బస్సు కింద పడి మృతిచెందాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.