పెద్దఅంబర్ పేట్‌లో కారు బీభత్సం | 2 severely injured in road accident | Sakshi
Sakshi News home page

పెద్దఅంబర్ పేట్‌లో కారు బీభత్సం

Oct 3 2016 2:54 PM | Updated on Apr 3 2019 7:53 PM

వేగంగా వెళ్తున్న కారు రోడ్డు పక్కన నిల్చుని ఉన్నవారిపైకి దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

హైదరాబాద్: వేగంగా వెళ్తున్న కారు రోడ్డు పక్కన నిల్చుని ఉన్నవారిపైకి దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించగా.. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటన నగరంలోని పెద్ద అంబర్‌పేట్‌లో సోమవారం చోటుచేసుకుంది. లాలాపేట్‌కు చెందిన తల్లీకూతుళ్లు శ్రీదేవి(35), సంజనా(6)లు దసరా సెలవుల సందర్భంగా అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్లడానికి రోడ్డుపైన బస్సు కోసం వేచి చూస్తున్న సమయంలో అతివేగంగా వచ్చిన కారు వారిని ఢీకొట్టింది. దీంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసే సమయానికి కారులోని వ్యక్తులు పరారైనట్లు స్థానికులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement