ఓల్డ్‌సిటీలో 'మోదీ' హల్‌చల్‌ | BJP distributes 'Modi Kites' to tourists near Charminar | Sakshi
Sakshi News home page

ఓల్డ్‌సిటీలో 'మోదీ' హల్‌చల్‌

Jan 15 2018 4:30 PM | Updated on Aug 21 2018 9:38 PM

BJP distributes 'Modi Kites' to tourists near Charminar - Sakshi

చార్మినార్‌ : ఓల్డ్‌సిటీలో 'మోదీ' హల్‌చల్‌ చేస్తున్నారు. ఆయన ఫోటోతో ఉన్న పంతగులు పాతబస్తీ వాసులను, పర్యాటకులను అలరిస్తున్నాయి. సంక్రాంతి సందర్భంగా బీజేపీ పార్టీకి చెందిన నాయకులు కొందరు ప్రధాని మోదీ ఫోటోతో కూడిన పతంగులను పంచిపెట్టారు. వారిలో ముస్లింలే అధికులు కావడం విశేషం.

''అన్ని పండుగలు హిందూ, ముస్లింలు కలిసి జరుపుకోవడం ఇక్కడే కాదు, దేశమంతటా ఆనవాయితీగా వస్తుంది. సంక్రాంతి పండుగ ప్రజలందరినీ ఒకే వేదికపైకి తీసుకొస్తుంది. హిందూ-ముస్లిం ఐక్యతను చాటే ఈ పండుగలో మేము పాలుపంచుకున్నాం'' అని బీజేపీ అధికార ప్రతినిధి మిర్‌ ఫిరసత్‌ అలీ చెప్పారు.

సంక్రాంతి, పతంగుల పండుగల సందర్భంగా బీజేపీ తెలంగాణ మైనారిటీ మోర్చ వైస్‌ ప్రెసిడెంట్‌ కవి అబ్బాసితో కలిసి, ఫిరసత్‌ అలీ, ప్రధాని నరేంద్రమోదీ ఫోటోతో కూడిన 300 పతంగులను చార్మినార్‌ వద్ద పర్యాటకులకు, స్థానికులకు పంచారు. పాత బస్తీ ప్రజల సంక్షేమాన్ని బీజేపీ చాలా సీరియస్‌గా తీసుకుందనే సందేశాన్ని ప్రజలకి అందిస్తున్నామని ఫిరసత్‌ అలీ చెప్పారు. 

1
1/2

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement