మద్యం షాపుపై మహిళల దాడి | women's attack on wine shop at samarlakota | Sakshi
Sakshi News home page

మద్యం షాపుపై మహిళల దాడి

Oct 19 2015 1:14 PM | Updated on Sep 3 2017 11:12 AM

తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జనావాసాల మధ్య ప్రభుత్వం ఏర్పాటు చేసిన మద్యం దుకాణంపై మహిళలు దాడులు చేశారు.

సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జనావాసాల మధ్య ప్రభుత్వం ఏర్పాటు చేసిన మద్యం దుకాణంపై మహిళలు దాడులు చేశారు. సోమవారం ఉదయం దాడికి దిగిన మహిళలు మద్యం సీసాలను ధ్వంసం చేశారు. డిగ్రీ కళాశాల ఇతర విద్యాసంస్థలు, జనావాసాల మధ్య మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేశారని, వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఒక్కసారిగా మహిళలు పెద్దసంఖ్యలో తరలిరావడంతో దుకాణం దారులు మూసేందుకు ప్రయత్నించినా మహిళలు జొరబడి మద్యం బాటిళ్లను పగలగొట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement