‘వ్యాపమ్’ చార్జిషీట్‌లకు ఓకే: సుప్రీంకోర్టు | Sakshi
Sakshi News home page

‘వ్యాపమ్’ చార్జిషీట్‌లకు ఓకే: సుప్రీంకోర్టు

Published Tue, Jul 21 2015 1:36 AM

‘వ్యాపమ్’ చార్జిషీట్‌లకు ఓకే: సుప్రీంకోర్టు - Sakshi

న్యూఢిల్లీ: వ్యాపమ్ కుంభకోణంలో అన్ని కేసులను సీబీఐకి బదలాయించే ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ చార్జిషీట్లను దాఖలు చేసేందుకు మధ్యప్రదేశ్ ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్), ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌లకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. పిటిషన్‌ను సోమవారం విచారించిన సుప్రీంకోర్టు చార్జిషీట్ల దాఖలుకు అనుమతినిచ్చింది. విచారణను జూలై 24కు వాయిదా వేసింది.  కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్ తరఫున కోర్టుకు హాజరైన సీనియర్ న్యాయవాది సిబల్..

సీబీఐకి వివరణ ఇవ్వడానికి మరింత గడువు కావాలన్నారు. కుంభకోణానికి సంబంధించిన కేసులన్నింటినీ సీబీఐకి బదలాయించాలని ఈ నెల 9న కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Advertisement
Advertisement