ఛత్తీస్‌ఘడ్ సరిహద్దులోని అటవీ ప్రాంతంలో విధి నిర్వహణలో ఉన్న ఇద్దరు అటవీ అధికారులను మావోయిస్టులు సోమవారం అర్థరాత్రి కిడ్నాప్ చేశారు.
చర్ల: ఛత్తీస్‌ఘడ్ సరిహద్దులోని అటవీ ప్రాంతంలో విధి నిర్వహణలో ఉన్న ఇద్దరు అటవీ అధికారులను మావోయిస్టులు సోమవారం అర్థరాత్రి కిడ్నాప్ చేశారు. ఖమ్మం జిల్లా అటవీ శాఖలో సహాయ అటవీ అధికారిగా పనిచేస్తున్న మోహన్, బీట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న కోటేశ్వరరావు సోమవారం సాయంత్రం విధినిర్వహణలో సరిహద్దు గ్రామమైన చెన్నాపురం శివారులోని అడవుల్లోకి వెళ్లారు. అక్కడ కాపుకాసిన ఛత్తీస్‌ఘడ్ కు చెందిన మావోయిస్టులు వీరిని కిడ్నాప్ చేశారని గ్రామస్తులు చెబుతున్నారు. ఇంతవరకూ వీరి ఆచూకి తెలియలేదు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.