ఆ ముగ్గురిని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు | three maoists who's been arrested by warangal police, produced before court | Sakshi
Sakshi News home page

ఆ ముగ్గురిని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు

Sep 19 2015 4:30 PM | Updated on Sep 3 2017 9:38 AM

సంచలనం రేపిన మావోయిస్టు పార్టీ సభ్యులు శ్రుతి, సాగర్ ల ఎన్ కౌంటర్ అనంతరం వరంగల్ జిల్లాలో పట్టుబడ్డ ముగ్గురు మావోయిస్టులను పోలీసులు శనివారం కోర్టులో హాజరుపర్చారు.

వరంగల్: సంచలనం రేపిన మావోయిస్టు పార్టీ సభ్యులు శ్రుతి, సాగర్ ల ఎన్ కౌంటర్ అనంతరం వరంగల్ జిల్లాలో పట్టుబడ్డ ముగ్గురు మావోయిస్టులను పోలీసులు శనివారం కోర్టులో హాజరుపర్చారు.

ఖమ్మం, కరీంనగర్, వరంగల్ (కెకెడబ్ల్యు) దళానికి చెందిన అసిస్టెంట్ డిప్యూటీ కమాండర్ కోవాసి గంగా అలియాస్ మంగ్యా, విట్టి భీములు, దీము కిష్టయ్యతో పాటు మావోయిస్టు సానుభూతి పరుడు శేఖర్‌ను కూడా అరెస్టు చేసినట్లు శుక్రవారం వరంగల్ ఎస్పీ అంబర్ కిశోర్ ఝా ప్రకటించడం తెలిసిందే. అరెస్టయిన ముగ్గురూ చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన వారని, 2010 నుండి మావోయిస్టు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారన్నారని ఎస్సీ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement