పెళ్లికి ఒప్పుకోలేదని.. | The young man committed suicide | Sakshi
Sakshi News home page

పెళ్లికి ఒప్పుకోలేదని..

Feb 16 2016 6:54 PM | Updated on Nov 6 2018 7:56 PM

ప్రేమించిన అమ్మాయితో కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించడంతో.. ఓ యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

ప్రేమించిన అమ్మాయితో కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించడంతో.. ఓ యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా ధర్మవరంలోని గాంధీనగర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుజ్జల సాయినాథ్(22) ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈక్రమంలో ఓ యువతిని ప్రేమించాడు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులకు చెప్పాడు. దీనికి కుటుంబ సభ్యులు నిరాకరించడంతో.. మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement