వ్యాయామ ఉపాధ్యాయుడు (పీడీ) విపరితంగా కొడుతున్నాడని ఆరోపిస్తూ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయిన సంఘటన విశాఖపట్నం జిల్లా పెదబయలు మండలంలో చోటుచేసుకుంది.
పెదబయలు: వ్యాయామ ఉపాధ్యాయుడు (పీడీ) విపరితంగా కొడుతున్నాడని ఆరోపిస్తూ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయిన సంఘటన విశాఖపట్నం జిల్లా పెదబయలు మండలంలో చోటుచేసుకుంది.
మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో వ్యాయమ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న జి. ధనుంజయ్ తమను విపరితంగా కొడుతున్నారని, అనవసరంగా తిడుతున్నారని.. దీనికి నిరసనగా తరగతులు బహిష్కరించి ఇంటిబాటపట్టామని బ్లాక్ బోర్డులపై రాసిమరీ వెళ్లారు విద్యార్థులు. ఈ ఆశ్రమ పాఠశాలలో మొత్తం 430 మంది విద్యార్థులు ఉండగా.. దాదాపు 400 మంది విద్యార్థులు ఇళ్లకు వెళ్లారు.