ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు

stockmarkets end with flat note - Sakshi

సాక్షి,ముంబై: రికార్డ్‌ స్థాయిలో మోత మోగించిన స్టాక్‌మార్కెట్లు గురువారం  ఫ్లాట్‌గా మారాయి.   ట్రేడర్లు లాభాల స్వీకరణకే  మొగ్గు చూపడంతో  ప్రధాన ఇండెక్సులు స్వల్ప నష్టాలతో  ముగిశాయి.  కన్సాలిడేషన్‌ మూడ్‌లో  ఉన్న మార్కెట్లో  సెన్సెక్స్‌ 27  పాయింట్ల నష్టంతో 33573 వద్ద, నిఫ్టీ 17పాయింట్లు క్షీణించి 10, 422  వద్ద ముగిసింది.   ముఖ్యంగా  పీఎస్‌యూ బ్యాంక్‌ కౌంటర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించగా,  కొనుగోళ్ల మద్దతుతో ఫార్మా రంగం  రీబౌండ్‌ అయింది.  దీంతో ఇవాల్టి మార్కెట్లకు  ఫార్మా దూకుడు మంచి మద్దతు ఇచ్చిందని చెప్పవచ్చు.  ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌, ఆటో రంగాలు నష్టాల్లో ముగిశాయి. 

దివీస్‌,  శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌,  హెక్సావేర్‌, అరబిందో, లుపిన్‌, డా. రెడ్డీస్‌ టాప్‌విన్నర్స్‌గా నిలవగా వీటితోపాటు క్యాడిల్లా హెల్త్‌కేర్‌,  ఐడియా  లాభపడ్డాయి. మరోవూపు  టెక్‌ మహీంద్రా, సెయిల్‌,  భారతి ఎయిర్‌టెల్‌, కెనరా బ్యాంక్‌,హెచ్‌డీఎల్‌ ఫెడరల్‌బ్యాంక్‌, హిందాల్కో, స్టేట్‌బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం  నష్టపోయినవాటిల్లో ఉన్నాయి. 




 

Read also in:
Back to Top