బేబీ కోసం సీట్... | seat for Baby | Sakshi
Sakshi News home page

బేబీ కోసం సీట్...

Jul 10 2015 2:09 AM | Updated on Sep 3 2017 5:11 AM

బేబీ కోసం సీట్...

బేబీ కోసం సీట్...

కార్లు రకరకాలు.. అందులోని సీట్ల డిజైన్లు రకరకాలు.. కానీ చిన్నపిల్లల పరిస్థితి ఏమిటి?

కార్లు రకరకాలు.. అందులోని సీట్ల డిజైన్లు రకరకాలు.. కానీ చిన్నపిల్లల పరిస్థితి ఏమిటి? అమ్మా లేదా నాన్న ఒళ్లో పెట్టుకోవాల్సిందే.. దీనికి పరిష్కారంగా వోల్వో బేబీ సీట్‌ను డిజైన్ చేసింది. డ్రైవర్ పక్కనున్న సీటుకు బదులుగా.. దీన్ని ఏర్పాటు చేసింది. ఇది చిన్నపిల్లలకు చాలా అనువుగా ఉంటుందట.. వారిని నిద్రపుచ్చేలా చేయడానికి వీలుగా ఇది ఉయ్యాల ఊగినట్లుగా కొంచెం అటూఇటూ కదులుతుంది. సీటు ముందుకు, వెనక్కు తిరిగేలా ఏర్పాటు చేశారు. దీని వల్ల ఇదిగో చిత్రంలో చూపినట్లు మీ పిల్లలను ఆడిస్తూ..

వారితో ముచ్చట్లాడొచ్చు. వారి నాప్కిన్స్ వంటివి పెట్టుకోవడానికి కింద జాగా కూడా ఇచ్చారు. ప్రస్తుతానికి ఇది డిజైన్ దశలో ఉంది. భవిష్యత్తులో వీటిని కొన్ని మోడళ్లలో ప్రవేశపెట్టే అవకాశముందని చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement