ఇండియన్ బ్యాంకులో చోరీకి యత్నం | robbery attempt in indian bank at kurnool | Sakshi
Sakshi News home page

ఇండియన్ బ్యాంకులో చోరీకి యత్నం

Jan 21 2016 8:31 AM | Updated on Aug 30 2018 5:27 PM

కర్నూలు జిల్లా హళహర్వి మండలకేంద్రంలోని ఇండియన్ బ్యాంకు శాఖలో గురువారం వేకువజామున చోరీ యత్నం జరిగింది.

హళహర్వి: కర్నూలు జిల్లా హళహర్వి మండలకేంద్రంలోని ఇండియన్ బ్యాంకు శాఖలో గురువారం వేకువజామున చోరీ యత్నం జరిగింది. ముసుగు ధరించిన ముగ్గురు వ్యక్తులు షట్టర్ లేపి బ్యాంకులోకి ప్రవేశించారు.
 
తాళాలు పగులగొట్టి రూంలోని లాకర్‌ను తెరిచేందుకు ప్రయత్నించారు. అది వీలుకాకపోవటంతో ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి వెనుదిరిగారు. ఉదయం గమనించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలానికి చేరుకుని, సీసీ ఫుటేజిని పరిశీలిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement