ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట్‌లోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల లో ఒక విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది.
ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట్‌లోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల లో ఒక విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని సోమవారం ఉదయం గుర్తు తెలియని లిక్విడ్ తాగింది. కొంతసేపటికి గమనించిన నిర్వాహకులు ఆమెను కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆమెకు ఎటువంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.ఇంగ్లిష్ మీడియం కారణంగా చదువులో వెనుకబడిపోయాననే ఆవేదనతోనే ఆమె ఆత్మహత్యకు యత్నించిందని సమాచారం.