రూ.6 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం | redsander seized in ysr kadapa distirict | Sakshi
Sakshi News home page

రూ.6 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం

Jul 30 2015 1:38 PM | Updated on Sep 3 2017 6:27 AM

వైఎస్సార్ జిల్లాలో భారీగా ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి.

కడప: వైఎస్సార్ జిల్లాలో భారీగా ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. గురువారం రూ.6 కోట్ల విలువైన మూడు టన్నుల బరువున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓఎస్డీ రాహుల్ దేవ్ విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాలివీ...విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు బి.కోడూరు మండలం తోకరస్తా ప్రాంతంలో గురువారం వేకువజామున తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఓ వ్యానులో తరలిస్తున్న114 ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. సుమారు మూడు టన్నుల బరువు ఉన్న ఈ దుంగల విలువ రూ.6 కోట్లు ఉంటుందని సమాచారం. అయితే, దుంగలను తరలిస్తున్న వారు పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు ప్రారంభించారు.


Advertisement
 
Advertisement
Advertisement